మాకు ఒక్క ముస్లిం ఓటు కూడా అవసరం లేదు: కర్ణాటక బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప

  • అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం
  • జాతీయవాద ముస్లింల ఓట్లు తమకే పడతాయన్న ఈశ్వరప్ప
  • యెడ్యూరప్ప నిజమైన హిందువు అని కితాబు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి కేఎఎస్ ఈశ్వరప్ప ఓ సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లిం ఓటు కూడా బీజేపీకి అవసరం లేదని అన్నారు. జాతీయవాద ముస్లింల ఓట్లు మాత్రం బీజేపీకే పడతాయని చెప్పారు. యెడ్యూరప్ప నిజమైన హిందువు అని, హిందువులకు ఆయనొక మోడల్ అని కొనియాడారు. బీజేపీతోనే హిందువులకు భద్రత అని తనతో చాలా మంది చెప్పారని అన్నారు. శివమొగ్గలో లింగాయత్, వీరశైవ సామాజిక వర్గాలతో నిర్వహించిన సభకు ఈశ్వరప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

KS Eswarappa
Muslims
karnataka
BJP

More Telugu News